
మహిళా శక్తి సంబురాల కళాజాతా
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి సంబురాల్లో భాగంగా సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా శక్తి కళాజాతా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల సమైఖ్య ఎపీఏం అంబాల రవివర్మ, కళాకారులు మైస ఎర్రన్న, సెగ్గం శీరీష, సుమలత, రాధిక, ప్రవీణ్, మధుబాబు, శంకర్, రవి, శ్యామల , స్వాతి, స్వప్న, విజయ్‌కుమార్, యాకూబ్, అనిత, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.