
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత
టేకుమట్ల: గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత ఉంటుందని ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఉపయోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమన్నారు. గ్రామాల్లో ఎదైనా దొంగతనాలు జరిగితే సీసీ ఫుటేజీతో కేసును ఛేదించడం సులభతరం అవుతుందని అన్నారు. ఏఎస్సై దాట్ల కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ పోషన్న, రాజమౌళి, కానిస్టేబుళ్లు మహేందర్, వెంకటేశ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై సుధాకర్