ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కేటాయించాలి
గణపురం మండలంలోని ఓపెన్ కాస్టు–3 ప్రాజెక్ట్‌లో గుర్రంపేట ఎస్సీ కాలనీ ప్రజలందరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రామ సమీపంలో ఓపెన్ కాస్ట్ ఏర్పాటు చేయడంతో అనారోగ్య పాలవుతున్నాం. ఓపెన్‌కాస్ట్ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో ప్రమాదం పొంచి ఉంది. బ్లాస్టింగ్ సామార్‌ాధ్యనికి మించి చేయడం వలన ఇంటిలో పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అనే భయందోళనలో ఉన్నాం. గతంలో కలెక్టర్. సింగరేణి అధికారులు మా గ్రామానికి వచ్చి సమస్యను పరిశీలించారు. ప్రత్యమ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు.
– దూడపాక శంకర్, గుర్రంపేట, భూపాలపల్లి


