అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే నిర్వహించన్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని అధికారులు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని అధికారి సునీత పిలుపునిచ్చారు.
గుండెపోటుతో
ఎంపీడీఓ మృతి
మొగుళ్లపల్లి: స్థానికంగా ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మహబూబ్ హుస్సేన్(61) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల అయినప్పటికీ కుటుంబ అవసరాల రీత్యా హనుమకొండ పట్టణంలో నివాసముంటూ విధులకు హాజరయ్యేవారు. విధి నిర్వహణలో బాధ్యతయుతంగా ఉంటూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారని పేరుంది. వచ్చే నెలలో పదవి విరమణ చేయనుండగా.. ఇంతలోనే గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఆయన మృతిపై కార్యాలయ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.
టర్పెంట్ ఆయిల్ తాగి బాలుడి మృతి
కాటారం: టర్పెంట్ ఆయిల్ తాగి 21 నెలల బాలుడు మృతి చెందిన ఘటన కాటారం మండలం ధన్వాడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మాజీ ఎంపీటీసీ బోడ మమత నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు బోడ సుహాన్ (21 నెలలు) తల్లి మమతతోపాటు ఇంటి పక్కన వారింటికి వెళ్లాడు. మమత గుమ్మాలకు ముగ్గులు వేసే పనిలో నిమగ్నమవగా సుహాన్ ఆడుకుంటూ పెయింట్‌లో కలిపే టర్పెంట్ ఆయిల్ తాగాడు. కొంత సమయానికి సుహాన్ కిందపడిపోగా గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
పేకాట స్థావరాలపై దాడి
మల్హర్: మండలంలోని నాచారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈమేరకు 17 మంది వద్ద నుంచి రూ.1.50 లక్షలు, 5 బైకులు, 17 సెల్ ఫోన్లు, 52 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ శనివారం తెలిపారు. 17 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
‘కక్ష సాధింపు కోసమే
వక్ఫ్ బిల్లు’
భూపాలపల్లి అర్బన్: ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శని వారం సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడు తూ.. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టా న్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ చట్టాన్ని చా లా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతి రేకిస్తున్నప్పటికీ టీడీపీ, జేడీయూ పార్టీల సహకారంతో ఓటింగ్ ద్వారా చట్టాన్ని ఆమోదం చేసుకున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డుకు ఇతర మతస్తులు సాయం చేయకుండా ఈ చట్టం తీసుకురావడం సరికాదన్నారు. హిందువులు, ఇతర మతస్తులు.. బోర్డుకు ఆర్ధికంగా సహా యం చేయాలంటే వారు కూడా మతం మారా లని చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, యాకూబ్ పాషా, కృష్ణ, శేఖర్, రజియా, శ్రీలత, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి


