
ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం
జనగామ రూరల్: ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆ ర్టీసీని బలోపేతం చేయడమే కాక ప్రజల్లో నమ్మకా న్ని పెంచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిపోలో 2.26 కోట్ల మహిళలు ప్రయాణించి రూ.108.96 కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు తెలిపారు. బస్సు ల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారారన్నారు. అనంతరం ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ మాట్లాడుతూ. ఆర్టీసీ సంస్థ లాభాల బాటల పయనించడం సంతోషకరంగా ఉందన్నారు. డీఎం స్వాతి ఆర్టీసీ ప్రగతిని వివరిస్తూ గతంలో 36 వేల మంది ప్రయాణించే ఈ ప్రాంతం 56 వేల మంది ప్రయాణికులతో 66శాతం మహిళలతోనే ప్రయాణాలు కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పరుగులు పెడుతున్నదని అందుకు ఆర్టీసీ ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. కాగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి కలెక్టర్ సన్మానించి ప్రత్యేక బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో అడీషనల్ డీఆర్‌డీవో నూరుద్దీన్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మమత ఆర్టీసీ అధికారులు సిబ్బంది మహిళ ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
రఘునాథపల్లి: జిల్లాలో సరిపడు యూరియా నిల్వ లు ఉన్నాయని, కొరత సృష్టిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. బుధవారం మండలకేంద్రంలోని వెంకటేశ్వర, లక్ష్మి ఫర్టిలైజర్ షాపులు, ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఉన్నత పాఠశాలలో కిచెన్‌షెడ్‌ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, సరుకుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంఈఓ రఘునందన్‌రెడ్డి, డీఏఓ అంబికాసోని పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
బస్టాండ్‌లో మహాలక్ష్మి
పథకం సంబురాలు

ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం