అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ రూరల్: విద్యార్థులకు తప్పనిసరిగా ఆర్‌బీఎస్‌కే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మండలం చౌడారం మోడల్ పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్రీయ బాల స్వస్తియ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు తప్పనిసరిగా వైద్య పరీక్షల నిర్వహించి, నివేది కను అందజేయాలన్నారు. మందుల స్టాక్ రిజిస్టర్‌ను విద్యార్థుల సంఖ్యను కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు వేడి చేసి చ ల్లార్చిన తాగునీటిని ఇవ్వాలని, తాజాగా వండిన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సంపత్ కుమార్, అ ధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్లకు
పదోన్నతులు
జనగామ: ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగం (డీఎంఈ) పరిధిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వైద్యులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా స్పెషాలిటీ విభాగాల్లో పని చేస్తున్న వారికి పదోన్నతి కల్పిస్తూ ప్రొఫెసర్లుగా తక్షణమే విధుల్లో చేరే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్య డైరెక్టర్ ఆదేశాలను అనుసరిస్తూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పదోన్నతి పొందిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, పదోన్నతి ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 15రోజుల వ్యవధిలోపు ఆ పదవిలో చేరాలని, లేదంటే పదోన్నతి కోల్పోతారని పేర్కొన్నారు. జనగామ వైద్య కాలేజీ పరిధిలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న పది మంది పదోన్నతిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. బయో కెమిసీ్త్ర విభాగంలో హైదరాబాద్ ఉస్మానియా వైద్య కాలేజీ నుంచి డాక్టర్ బనూజరాణి, డీవీఎల్ విభాగంలో డాక్టర్ ఎన్.సుధీర్ పదోన్నతిపై జనగామ వైద్య కాలేజీకి రానున్నారు.
గొర్రెలతో నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట బుధవారం గొర్రెలతో నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు అందించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మల్లేశం మా ట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గొర్రెలు, మేకల పెంపకందార్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు అమరాజు రాజయ్య, గుంటి రాజ య్య, కుమార్, ఐలయ్య, అశోక్, చంద్రయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.