
ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి: దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సాగు నీటిని విడుదల చేశారు. రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయ ర్ కుడి కాలువ, చీటకొడూర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి పసుపు, కుంకుమ, పూలు చల్లారు. అనంతరం కడియం మాట్లాడుతూ ఘన్‌పూర్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్ కింద స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి రిజర్వాయర్‌ల ద్వారా ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపా రు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా కొందరు బీఆర్‌ఎస్ నాయకులు సాగునీటి విషయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, నాయకులు బెలిదె వెంకన్న, నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నీటిపారుదల ఎస్‌ఈ సుధీర్, ఈఈ వినయ్‌బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బొల్లం అజయ్, గుడి వంశీధర్‌రెడ్డి, కోళ్ల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పలు రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల