
సకాలంలో బిల్లులు అందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం లేకుండా లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వచ్చేలా అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న తానేదార్‌పల్లిలో మంగళవారం క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలను పరి శీలించారు. గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారితో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, బిల్లులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో కొందరు బిల్లులు రావడం లేదని తెలుపగా అక్కడే ఉన్న హౌసింగ్ అధికారులను వివరణ అడిగారు. బ్యాంకుల సమస్యతో జాప్యం అవుతుందని, రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, రెండు, మూడు రోజుల్లో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా, ఏఎంసీ చైర్‌పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, దుంపల పద్మారెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
సంక్షేమంలో దేశానికే ఆదర్శం
పేద వర్గాల సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీఎస్‌ఓ శ్రీనివాస్, లావణ్యశిరీష్‌రెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.