
లాఠీ పట్టిన చేతులతో గొర్రు కొట్టి..
● రైతుగా మారిన ఎస్సై లింగారెడ్డి
పాలకుర్తి: ఉద్యోగ రీత్యా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మేకల లింగారెడ్డి పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో పత్తి చేనులో గొర్రు కొట్టారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా గూడూరు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం పత్తి చేనులో గొర్రు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం రాక ముందు మా నాన్న మేకల సాంబిరెడ్డితో కలిసి వ్యవసాయం చేసే వాడినన్నారు. ఎస్సై లింగారెడ్డి పత్తి చేనులో గొర్రు కొట్టే విధానాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.