
ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ తరగతులు
జనగామ: ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో డిజిటల్ తరగతులను అమలు చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులకు వచ్చే నిరుపేద పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే విధంగా ముందుకు వెళుతుంది. గణితాన్ని సులభంగా పరిచయం చేయడంతో పాటు చిత్రాల ద్వారా కూడిక, తీసివేతల లెక్కలపై పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ కేంద్రం (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా బుధవారం టీ–శాట్ నిపుణుల ద్వారా ప్రాథమిక ప్రాథమికో న్నత పాఠశాలల్లో గణిత శాస్త్ర బోధనపై అవగాహన కల్పించారు. వర్చువల్ పద్ధతిలో జిల్లాలోని 348 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా పాల్గొన్నారు.
ట్యాబ్‌ల అందజేత
సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా విద్యశాఖ అధికారులు ఎస్‌సీఈఆర్‌టీ భాగస్వామ్యంతో డిజిటల్ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టింది. వీటిని స మర్థవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయుల కు ట్యాబ్‌లను అందించింది. వీటితో గణితం వంటి సబ్జెక్ట్‌లకు అనుసంధానం చేసి, ప్రాథమిక స్థాయిలో డిజిటల్ నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది.
వర్చువల్ పద్ధతిలో నిపుణుల బోధన