
రేపు సిద్ధేశ్వరాలయంలో వేలం
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రా మంలోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో రేపు (మంగళవారం) తలనీలాల హక్కుకు వే లం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆ ముదాల మల్లారెడ్డి ఆదివానం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలనీలాలు వేలం పాట వరుసగా రెండుసార్లు సరైన పాట రానందున వాయిదా వేశామన్నారు. ఆసక్తిగల వేలం పాటదారులు సకాలంలో వేలంలో పాల్గొనాలన్నారు.
జీఓ 282ను
ఉపసంహరించుకోవాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 282ను ఉపసంహరించుకోవాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పారిశ్రామిక యాజమాన్యానికి లాభాలు చేకూర్చేందుకు కార్మికుల శ్రమను తీవ్రంగా దోపిడీ చేసేందుకే కార్మిక శాఖ ద్వారా 8 గంటల పని దినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచేందుకు జీఓ 282 ఉత్తర్వులు జారీ చేశారని, ఈ జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సీపీఎం నాయకుల నిరసన
జనగామ రూరల్: పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాల క్రాస్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ పనులు నత్తనడక నడుస్తున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి అన్నారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 3, 4 వార్డుల్లో బాలాజీనగర్, జ్యోతినగర్ సెంట్ మేరీ స్కూల్ ఏరియా, లక్ష్మీ వాటర్ ప్లాంట్ ఏరియా, కురుమవాడ, ఏకశిలా స్కూల్ ప్రాంతం తదితర ప్రాంతాల్లో వరద నీటి నివారణ కోసం నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరీ పనులు ప్రారంభించి మూడు నెలలు కావస్తుందన్నారు. పనులు పూర్తి కాకపోవడంతో చిన్నపిల్లలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల లలిత, గాడి శివ, గుండు శ్రీనివాస్, రామా, తేజ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎరుకుల కులస్తుల
అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: సమాజంలో వెనుకబడిన ఎరుకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య అన్నారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా జనగామ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య మాట్లాడుతూ. తరతరాలుగా ఎరుకల జాతి ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు కూడా చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎరుకల కులస్తులను ఆదుకోవాలన్నారు. 1/70 చట్టం ద్వారా అటవీ హక్కులను స్థానిక ఆదివాసులకే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధిని రాములు, అంగడి మల్లయ్య, అంగిడి పోశయ్య, మైసయ్య, రిటైర్డ్ సీటీఓ ఉప్పలయ్య, దేవర రామ, మానుపాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

రేపు సిద్ధేశ్వరాలయంలో వేలం

రేపు సిద్ధేశ్వరాలయంలో వేలం