
లయన్స్‌క్లబ్ సేవలు విస్తృతం చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: లయన్స్ క్లబ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతం చేయాలని క్లబ్ జిల్లా గవర్నర్ కె.వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక లయన్ భవన్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ లయన్స్‌క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా కోతి వేణు, కార్యదర్శిగా దుస్స నరేష్, కోశాధికారిగా కోతి అశోక్‌తో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం క్లబ్ పూర్వ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా గవర్నర్ మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్ లయన్స్‌క్లబ్ 32 సంవత్సరాలు విశేష సేవలు అందిస్తుందని, అదే స్తూర్తితో నూతన క్లబ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ బాధ్యులు చంద్రశేఖర్‌ఆర్య, కేసీ జాన్‌బన్నీ, కన్నా పరశురాములు, రాజిరెడ్డి, అంబటి కిషన్‌రాజ్, జొన్నల రాజేశ్వరరావు, హరికిషన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.