ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పాలకుర్తిటౌన్/కొడకండ్ల/జఫర్‌గఢ్: పోలీస్‌స్టేషన్ వచ్చి బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి, కొడకండ్ల, జఫర్‌గఢ్ పోలీస్‌సేష్టన్లను సందర్శించిన ఆయన పరిసరాలు, రికార్డులు, రిసెప్ష్షన్, లాకప్, మెన్ బ్యారక్ పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వెస్ట్‌జోన్ వర్ధన్నపేట డివిజన్ పరిధి పోలీస్‌స్టేషన్ల అధికారుల పని తీరును పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని సత్వరమే నాయ్యం చేసేలా చర్యల తీసుకోవా లని ఆదేశించారు. అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. ఆయన వెంట జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జానకీరామ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు వపన్‌కుమార్, లింగారెడ్డి, యాకూబ్‌రెడ్డి, చింత రాజు, రామ్‌చరణ్ తదితరులు పాల్గొన్నారు. అంత కు ముందు శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీపీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగం నాగరాజు పాల్గొన్నారు.
వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి


