
చివరి గింజ వరకూ మద్దతు ధర
జనగామ రూరల్: రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించగా జిల్లాలో కలెక్ట ర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ అవుతున్నదని చెప్పారు. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్‌లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. మీ–సేవా కేంద్రాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి వెల్లడించారు. వీసీలో డీఎం సీఎస్ హాతీరాం, డీసీఎస్‌ఓ సరస్వతి, డీఎంఓ నరేందర్, డీఏఓ రామారావు నాయక్, డీసీఓ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి