బచ్చన్నపేట: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తొందరగా మిల్లులకు తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. మండలంలోని కొడవటూర్, ఆలింపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. రైతుల ధాన్యం తేమ శాతం రాగానే తూకం వేసి, మిల్లులకు తరలించాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ధాన్యం తడిసి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గన్నీ బ్యాగులు సరిపడా లేకున్నా, లారీలు రాకున్నా తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడుతామన్నారు. మిల్లర్లు రైతుల ధాన్యంపై కొర్రీలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలింపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి మూడు రోజులు అవుతున్నా.. లారీలు రావడంలేదని రైతులు ఆయనకు తెలియజేయడంతో వెంటనే లారీ యాజ మాన్యంతో మాట్లాడి లారీని పంపించాలని చెప్పారు. తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఎంఆర్‌ఐ వంశీకృష్ణ, సీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను పెంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేదిశగా వైద్య, ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, మల్కాపూర్, ఇప్పగూడెం, తాటికొండ పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలతో స్థానిక సీహెచ్‌సీలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ప్రతినెలలో సీహెచ్‌సీ పరిధిలో కనీసం యాభై సాధారణ ప్రసవాలను చేపట్టాలన్నారు. ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజరీ స్టాఫ్ ప్రజలకు వివరించాలన్నారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ వీరాంజనేయులు, మాతా, శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్, ఘన్‌పూర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య, డాక్టర్లు సునీత, రుబీనా, ప్రణీత, జ్యోతి, కుషాలి, శ్రావన్, అజయ్‌కుమార్, సీహెచ్‌ఓ వెంకటస్వామి, ప్రభాకర్ పాల్గొన్నారు.
అసోసియేషన్ ఎన్నిక
జనగామ: జనగామ జిల్లా ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్, సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను పట్టణంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశెట్టి ము నిందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్ హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పజ్జూరి గోపయ్య, ప్రధాన కార్యదర్శిగా సదానందం, కోశాధికారి కాసర్ల రవీందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మునిందర్ మాట్లాడుతూ.. సీడ్స్ లైసె న్స్ రెండు సంవత్సరాల కాలపరిమితి నుంచి మూడేళ్లకు పెంపు, ఫెస్టిసైడ్స్ లైసెన్స్‌కు సంబంధించి రెగ్యులర్‌గా ఉండే విధంగా ఆల్ ఇండియా అసోసియేషన్ భాగస్వామ్యంతో కలిసి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి హక్కులను సాధించుకున్నామన్నారు. కార్యక్రమంలో గూ డెల్లి మధుసూదన్‌రెడ్డి, నడిపెల్లి సీతారాంరెడ్డి, ధనుంజయ, మహేష్, సురేందర్ ఉన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
జనగామ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జనగామ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అ ర్హులకు మాత్రమే పథకాలు అందిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలు అందుకున్నవారు విని యోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ రాజకీయలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనను పార్టీ కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అవినీతికి పాల్పడినా పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు.