
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జనగామ ఆర్డీఓ గోపీరాం అన్నారు. సోమవారం మండల పరిధి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే వివాదాస్పద భూములను పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ భూ భారతి ద్వారా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. భూసమస్యలు ఉన్న వారు నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, దళారుల వద్దకు వెళ్లకూడదని తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఎంఆర్ ఐ గోపీ, సర్వేయర్ నర్మద ఉన్నారు.