
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
జనగామ/జనగామ రూరల్: ‘ఆసరా లేనిదే నడవలేని కొడుక్కు పింఛన్ కోసం ఓ మాతృమూర్తి.. తలదాచుకోవడానికి నీడలేక ఇందిరమ్మ ఇల్లు మంజూ రుకు నిరుపేద మహిళ.. ఇళ్ల మంజూరులో అన్యా యం చేశారని ఓ దివ్యాంగుడు.. ఆన్‌లైన్‌లో భూమి కనిపించక పదేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కరించడంలేదని మరో బాధితుడు’..
ఇలా.. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కా రం కావడంలేదని వాపోయారు. వివిధ సమస్యలపై 47 వినతులు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, జిల్లా స్థాయి అధికారులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కారం చూపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌కు 47 వినతులు
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
అధికారులకు కలెక్టర్ ఆదేశం