పద్దెనిమిదేళ్లకు ఇంటికి చేరిన మహిళ
రఘునాథపల్లి : మతిస్థిమితం కోల్పోయి 18 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మండల పరిధి కన్నాయపల్లికి చెందిన మంతపురి ఎల్లమ్మ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. దేవరుప్పులకు చెందిన చింత సోమయ్య–వెంకటమ్మ దంపతుల కూతురు ఎలమ్మ ను కన్నాయపల్లికి చెందిన యాదయ్యకు ఇచ్చి వివా హం చేశారు. ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయిన ఎల్లమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుబ సభ్యులు ఎక్కడ వెతికినా జాడ లభించక విసిగిపోయారు. కేరళకు వెళ్లిన ఎల్లమ్మను అక్కడి ఆకాష్ ప్రవల్ స్వచ్ఛంద సంస్థ చేరదీసి మానసిక వ్యాధి నిపుణుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించింది. అదే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి వాసి బాషిపెల్లి యాకయ్యతో తాను జనగామ జిల్లా కన్నాయపల్లికి చెందిన మహిళగా చెప్పుకుంది. దీంతో ఎల్లమ్మ పూర్తి వివరాలు తెలుసుకున్న యాకయ్య దేవరుప్పుల, కన్నాయపల్లి గ్రామస్తుల కు సమాచారం అందించాడు. సంస్థ ప్రతినిధులు ఎలిషాబెత్, బి.సుభాషి, జెత్రుదీ సోమవారం ఎల్లమ్మను గ్రామానికి తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శికి, కుమారుడు అరవింద్‌కు అప్పగించారు.
స్వచ్ఛంద సంస్థ సహకారంతో
కుటుంబం చెంతకు


