గ్రామాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధే లక్ష్యం

May 12 2025 12:48 AM | Updated on May 15 2025 7:00 PM

దేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా విద్య, వైద్య రంగాల్లో ట్రస్టు పక్షాన నిరంతర తోడ్పాటు అందిస్తామని సీతారాంపురం హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అంబటి యాకన్న అన్నారు. ఆదివారం మండలంలోని సీతారాంపురం గౌడ కమ్యూనిటీ హాల్‌లో పగిడిపల్లి సతీష్‌ అధ్యక్షతన తొలుత ఇటీవల పాకిస్తాన్‌ సరిహద్దులో దేశం కోసం అశువులు బాసిన వీరజవానుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందించి తల్లిదండ్రులను సన్మానించారు. చైతన్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించి పలు సందేహాలకు నివృత్తి చేశారు. అలాగే ట్రస్టు సభ్యుడు పోరండ్ల శ్రీనివాస్‌ ఽఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హనుమాన్‌జీ, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి సతీష్‌, కోశాధికారి ఆవుల రాజు, సంయుక్త కార్యదర్శులు బస్వ నాగరాజు, దొడ్డి రమేష్‌, పుప్పల సోమేశ్వర్‌, భాషిపాక సుధాకర్‌, కార్యవర్గ సభ్యులు అనంతుల శివ, పెండెం ఉపేందర్‌, బస్వ మల్లేషమ్‌ తదితరులు పాల్గొన్నారు.

భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా పద్మారెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా మండలంలోని తానేదార్‌పల్లికి చెందిన దుంపల పద్మారెడ్డిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్యయాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల యాదగిరి ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలో నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కేజీబీవీలో డిజిటల్‌ క్లాస్‌ మానిటర్‌ చోరీ

తరిగొప్పుల: మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో గుర్తుతెలియన వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో హాస్టల్‌ విద్యార్థులు వారి ఇంటికి వెళ్లిపోయారు. నైట్‌ వాచ్‌ ఉమెన్‌ ఉన్నప్పటికీ రాత్రివేళలో ఒంటరిగా విధులు నిర్వర్తించలేక ఉదయం సమయంలోనే విధులు నిర్వర్తించి రాత్రి సమయంలో విధుల్లో ఉండడంలేదు. ఇది గమనించిన దుండగులు శనివారం రాత్రి పాఠశాల తాళం పగులకొట్టి సీసీ కెమెరా హార్డ్‌డిస్క్‌, డిజిటల్‌ తరగతులు బోధించే 100 అంగుళాల ఎల్‌ఈడీ మానిటర్‌ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం యథావిధిగా సిబ్బంది విధులకు రాగా పాఠశాల తాళం పగులగొట్టి ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు చోరీ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఓ తెలిపారు.

గ్రామాభివృద్ధే లక్ష్యం1
1/1

గ్రామాభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement