
డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల్లోని 2,4,6 సెమిస్టర్ల, బ్యాక్‌లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షల టైంటేబుల్‌ను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
సెమిస్టర్ల వారీగా ఇలా..
● రెండో సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 14, 16, 19, 21, 23, 2 6, 28, 30 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
● నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15, 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4వ తేదీల్లో ఉద యం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.
● ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4, 10, 11, 12, 13, 16వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయి.
● 6వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14, 16, 19, 21, 23, 26, 28, 30. జూన్ 3, 5, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.
● మొదటి సెమిస్టర్ పరీక్షలు జూన్ 17,18, 20, 21, 23, 24, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటలవరకు జరుగుతాయి.
● మూడవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటాయి.
14నుంచి సెమిస్టర్ల పరీక్షలు