
రైతులకు బాసటగా నిలుద్దాం
దేవరుప్పుల: గత ప్రభుత్వం పేదలకు పంచిన భూ పంపిణీ పట్టా రైతులకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన రీతిలో బాసటగా నిలుద్దామని హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్‌అలీ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రంబోజిగూడెం శివారులో భూపంపిణీ పట్టాలను రద్దు చేసే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొమ్ముల సురేందర్, జనగామ జిల్లా ఇన్‌చార్జ్ కన్నారపు పరుశురాములు, చిన్నమడూరు గ్రామ దళిత నాయకులు మేడ సోమనర్సయ్య, పాలడుగు యాదగిరి, దుబ్బాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది సాధిక్‌అలీ