
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు.