
‘భూ భారతి’తో రైతులకు న్యాయం
చిల్పూరు: భూ సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చింది.. దీని ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన భూ భారతి ఆర్‌ఓఆర్–2025 చట్టంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గత ప్రభత్వం తెచ్చిన ధరణిలో చాలా పొరపాట్లు జరిగాయని, అర్హులైన రైతులు నష్టపోగా పాలకులు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని అన్నారు. ధరణి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాల నే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అధికారులు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఈ చట్టంతో కలిగే ప్రయోజ నాలను వివరించాలన్నారు. ఈ సదస్సులో తహసీల్దార్ సరస్వతి, ఆర్‌ఐ చీకటి వినీత్, చిల్పూరు ఆలయ మైర్మన్ శ్రీధర్‌రావు, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ లావణ్య, ఎంపీఓ మధుసూదన్, వ్యవసాయాధికారి నజీరుద్ధీన్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రఘునాథపల్లి: మండల పరిధిలోని లక్ష్మీతండా, ఇబ్రహీంపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఫతేషాపూర్ నుంచి రామచంద్రగూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును, ఇబ్రహీంపూర్‌లో పునరుద్ధరించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, ఆర్‌డీఓ గోపిరాం, తహసీల్దార్ ఎండీ.మోహ్సి న్‌ముజ్తబ, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం సారయ్య, కోళ్ల రవిగౌడ్, నామాల బుచ్చయ్య, మల్కపురం లక్ష్మయ్య, మాలోతు నర్సింహ, పయ్యావుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి