
ఈఎంటీల సేవలు అభినందనీయం
ఈఎంటీలు తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధి నిర్వహనలో అంకితభావంతో పని చేస్తున్నారు. కాల్ వచ్చిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఓ స్నేహితుడు, బంధువుగా తోడుంటూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వారి సేవలు అభినందనీయం.
– ఎస్‌కె నసీరొద్దీన్, 108 సర్వీసెస్ ప్రోగ్రాం మేనేజర్
సకాలంలో ఆస్పత్రికి తరలిస్తున్నాం..
17 సంవత్సరాలుగా 108 అంబులెన్స్‌లో సేవలు అందిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, ఆత్మహత్యాయత్నాలు, గుండెనొప్పి ఇలా ఎందరో బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలిస్తాం. అనంతరం వారు కోలుకున్న తర్వాత బాధితుల ఆశీర్వచనాలు మాకు కొండంత బలం.
– మామిడి రాకేష్, ఈఎంటీ, జనగామ
అదృష్టంగా భావిస్తున్నా..
సంజీవనిగా పేరొందిన 108 అంబులెన్స్‌లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆపదలో ఉన్న వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, వారు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత వచ్చే సంతృప్తి ఎందులో దొరకదు. – వనజ, ఈఎంటీ
●

ఈఎంటీల సేవలు అభినందనీయం

ఈఎంటీల సేవలు అభినందనీయం