● గౌడ సంఘాల నాయకులు
జనగామ: జిల్లాకు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల ని తెలంగాణ గౌడ సంఘాల సమన్వ య వేదిక నాయకులు అంబాల నారా యణగౌడ్, వంగ సదానందంగౌడ్, పంజాల జైహింద్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వేదిక సమన్వయర్త కన్న పరశురాములు గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యా ల, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల గౌడ సంఘాల వేదిక ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలో వారు మాట్లాడారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా తరలివచ్చారు. బహుజన కులాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. చీపురు మల్లేశ్ యాదవ్, చల్లా సుధీర్‌రెడ్డి, అంకెనపల్లి వేంకటేశ్వర్లు, సానాడి రాజు, గిద్ద రాంనర్సయ్య, గొలుసుల దుర్గాచలం, బొమ్మెణ రాజుగౌడ్, మిట్టపల్లి విజయ్‌కుమార్‌గౌడ్, యాదగిరి, నామాల శ్రీనివాసు పాల్గొన్నారు.
పేరు మార్చితే మరో పోరాటం
● జిల్లా జేఏసీ కన్వీనర్ రాజు
జనగామ: జనగామ పేరు మార్చితే మరో పోరాటం తప్పదని జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు హెచ్చరించా రు. శుక్రవారం ఆర్టీసీ చౌరస్తాలోని ఉద్యమ స్ఫూర్తి(జైన) స్తూపానికి జేఏసీ ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ పేరు మార్చడమంటే ఇక్కడి మహనీయులను అవమానించడమే అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, మల్లిగారి రాజు, గండి నాగరాజు, ఆకుల సతీష్, పిట్టల సురేష్, గంగా భవాని, మీసాల వెంకన్న, గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్, నర్ర నవీన్, తిరుమల్‌రెడ్డి, ప్రణీత్ రెడ్డి, నల్ల రాహుల్, మద్దెల కార్తీక్, అజయ్, ఇమ్రాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి