
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
దేవరుప్పుల : ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళల స్వయం సమృద్ధికి విద్యాశాఖ పరంగా పనికల్పనకు తోడ్పాటు అందిస్తున్నామని డీఈఓ కె.రాము అన్నా రు. మండల కేంద్రంతోపాటు కామరెడ్డిగూడెంలో డీఆర్‌డీఏ పర్యవేక్షణలో కొనసాగుతున్న విద్యార్థుల యూనిఫామ్ తయారీ కేంద్రాలను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న 32వేల మంది విద్యార్థులకు తయారవుతున్న యూనిఫామ్ కుట్టు పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఏడాది క్రితం డీఆర్‌డీఏ సౌజన్యంతో ఐకేపీ, గ్రామైఖ్య సంఘాల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలవాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత పరిశీలన
వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాముల్లోని ఈవీఎంల స్ట్రాంగ్‌రూములకు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మరింత భద్రత కోసం తీసుకోవాల్సి న చర్యలపై సంబంధిత కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏనుమాముల పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ తదితరులు ఉన్నారు.

మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ