
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
విద్యారణ్యపురి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో సోమవా రం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలో ని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎర్రగట్టుగుట్ట వద్ద గల ఐయాన్ డిజిటల్ జోన్, నోబెల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, మోక్షిత కంప్యూటర్స్ కేంద్రాల్లో టెట్ పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు నిర్వహించిన ఐయాన్ డిజిట ల్ సెంటర్‌లో 245మంది అభ్యర్థులకు 214 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 29మంది గైర్హాజరయ్యారు. చైతన్య డీమ్డ్ వర్సిటీ సెంటర్‌లో ఉద యం 120 మంది అభ్యర్థులకు గాను 109 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 120మందికి గాను 99 మంది హాజరు కాగా 21మంది గైర్హాజరయ్యారు. మోక్షిత కంప్యూటర్స్ పరీక్ష కేంద్రంలో ఉదయం 380 మంది అభ్యర్థులకు గాను 322మంది హాజరయ్యారు. 58మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 380మందికి గాను 342మంది పరీక్ష రాయగా 38మంది గైర్హాజరయ్యారు. నోబెల్ పరీక్ష కేంద్రంలో ఉదయం 190 మందికి 172 మంది హాజరయ్యారు. 18మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 190మందికి గాను 163 మంది హాజరు కాగా 27మంది గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై పరీక్ష కేంద్రాలను సందర్శంచి పరిశీలించారని సమాచారం. ఈనెల 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్–2 పరీక్షలు కొనసాగుతాయి. ఈనెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో పేపర్–1 పరీక్షలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment