
ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు
బచ్చన్నపేట: దేశంలో అన్ని సంప్రదాయాల కంటే హిందూ సంప్రదాయాలు చాలా గొప్పవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం బచ్చన్నపేట శివారు గ్రామం ఎద్దుగూడెంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆలయంలో పూజల అనంతరం మాట్లాడారు. హిందూ సంప్రదాయాలు అన్ని మతాలు, వర్గాల వారిని ఐక్యం చేయడానికి దోహదపడతాయని అన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న దేవతల పండుగలను అందరూ తప్పక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్ వడ్డెపల్లి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బొమ్మెన అరుణ ఆంజనేయులు, గిరబోయిన అంజ య్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి