
రామాలయంలో శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న కడియం శ్రీహరి తదితరులు
చిల్పూరు: ఆలయాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండల పరిధి మల్కాపూర్‌లో నూతనంగా నిర్మించిన శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే నిర్మాణ దశలో ఉన్న రామాలయంలో శివలింగ ప్రతిష్ఠ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కడియంతోపాటు జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య వేర్వేరుగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయానికి రూ.లక్ష విరాళం అందజేసిన కడియం శ్రీహరి.. రెండు ఆలయాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామానికి చెందిన ఆలయ దాత తీగల రమేష్, సర్పంచ్ కొంగరి రవి, ఉప సర్పంచ్ బబ్బుల వంశీ, ఎంపీటీసీ మునిపల్లి సుధాకర్, ఎడవెళ్లి మాధవరెడ్డి, బబ్బుల శంకరయ్య, పోలెపల్లి రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి