
బీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల: దేశంలో కాలంచెల్లిన జాతీయ పార్టీల కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్ అనివార్యమైందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం హనుమకొండలోని మంత్రి స్వగృహంలో మండల పరిధి నీర్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక క్రియాశీల కార్యకర్తలున్న పార్టీగా బీఆర్‌ఎస్‌కు గుర్తింపు రావడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎడమ భాస్కర్ రెడ్డి, పిట్టల సత్తయ్య, పిట్టల నాగన్న, కాలువ నాగన్న, కాడబోయిన రాజు, కొత్తూరి జనార్ధన్, మడ్డి నర్సయ్య, పాక వీరస్వామి, పాక అంజయ్య, మహేష్, దండు యాదగిరి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ అన్వర్, బీఆర్‌ఎస్ నాయకులు పల్ల సుందర్‌రామిరెడ్డి, విద్యాసాగర్, పీఏసీఎస్ డైరెక్టర్ కొత్త జలంధర్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ కాసర్ల దయాకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు