
మహిళా సమాఖ్య వద్ద ట్రాక్టర్ డోజర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య
జఫర్‌గఢ్: మహిళల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్వర్ణ భారతి మండ ల సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. అలాగే కస్టమ్ హైరింగ్ సెంట ర్ల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను అద్దెకిచ్చే కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ సభ్యురాలు ఇల్లందుల బేబిశ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీటీసీలు జ్యోతి రజిత యాకయ్య, ఇల్లందుల స్రవంతి మొగిళి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య