రామగుండం: తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఎవల్‌ఫినిటీ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ స్థాపించాడు గద్దె శ్రీచరణ్. రామగుండానికి చెందిన గద్దె శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవార్డులు కై వసం చేసుకున్నారు. శ్రీచరణ్ అదే బాటలో నడుస్తూ మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. 2016లో ఎల్‌పీయూ యూనివర్సిటీలో సీఎస్‌ఈ ఇంజినీరింగ్ పూర్తి చేసే క్రమంలో సొంతంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు రూపొందించాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం సోషల్ ఆడిట్ మోబైల్ అప్లికేషన్ రూపొందించాడు. ఈ కంపెనీ ప్రస్తుతం 500 క్లయింట్లకు సేవలందించడంతో పాటు 1,050 ప్రాజెక్టులను డెలివరీ చేసి, ఒక మిలియన్ డాలర్ రెవెన్యూ మైలు రా యికి చేరుకుంది. నాన్న ప్రోత్సాహమే ఇందుకు కారణం అంటున్నాడు.


