మహనీయుల ఆశయాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే సంజయ్‌ ● ఘనంగా జగ్జీవన్‌రాం 119వ జయంతి

జగిత్యాలటౌన్‌: బాబు జగ్జీవన్‌రాం జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్లబావి వద్ద జగ్జీవన్‌రాం 119వ జయంతిని ఆదివారం ప్రారంభించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌రాం కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి జగ్జీవన్‌రాం కృషి చేశారని గుర్తు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..

జగిత్యాలక్రైం: జగ్జీవన్‌రాం దేశానికి ఆదర్శనేత అని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాదనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆర్‌ఐ సైదులు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement