రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

జగిత్యాలటౌన్‌: అధికార మదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. గజ్వేల్‌లోని కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంటే చూడలేకపోతున్న కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడటం దారుణమన్నారు. జగిత్యాల రూరల్‌, అర్బన్‌ మండలాల అధ్యక్షులు అయిల్నేని ఆనందరావు, తుమ్మ గంగాధర్‌, నాయకులు మహిపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, ఎల్ల రాజన్న, హరీష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement