● ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి
రాయికల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్, ఎంపీవో సుష్మ, సర్పంచులు చంద్రశేఖర్, ప్రసాద్, అంజయ్య, రాజేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హనుమండ్లు, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గన్నే రాజారెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, నిమ్మల శేఖర్ రెడ్డి, మహేందర్ బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


