లక్ష్యంతో ముందుకు సాగాలి
మల్లాపూర్/ మెట్‌పల్లిరూరల్: విద్యార్థులు లక్ష్యంతో ముందు కు సాగితే విజయం సొంతమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమా ర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సాతారం జెడ్పీ హైస్కూళ్లను శనివారం సందర్శించారు. చిటా, చెస్ నెట్‌వర్క్ అందించిన చెస్‌బోర్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. లక్ష్యం వైపు అడుగులు వేస్తే పాఠశాల, తల్లిదండ్రులు, పుట్టినఊరు పేరు నిలబడుతుందన్నారు. చెస్ నెట్‌వర్క్ ఫౌండర్లు సుధీర్ కోదాటి, రవి మయిరెడ్డి, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఎంఈవో దామోదర్‌రెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం చంద్రమోహన్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీహరి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు చెస్‌కిట్లను పంపిణీ చేశారు. హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.


