యావర్‌రోడ్డు విస్తరించి తీరుతా..
జగిత్యాల: తాను రాజకీయాన్నీ రాజకీయంగానే చూస్తానని, ఎవరో ఏదో మాట్లాడారని స్పందించబోనని, జిల్లాకేంద్రంలోని ప్రధానమైన సమస్య యావర్‌రోడ్డును విస్తరించి తీరుతానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. ప్రభుత్వ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాకేంద్రంలో రూ.230కోట్లతో మరో ఆస్పత్రి మంజూరైందన్నారు. మెడికల్ కళాశాల పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. గతంలో బిల్లులు రాకనే కాంట్రాక్టర్ చేతులెత్తేశారని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్‌రావు, వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు.


