అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్‌గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా.
ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్‌గా ఎన్నికై న జీల రాజుయాదవ్‌కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు.
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా


