పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్‌గా విజయం సాధించాడు.


