అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్‌ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్‌గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.


