గదుల నిర్మాణానికి స్థల పరిశీలన
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆల య పరిసరాల్లో 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19కోట్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఇంజినీరింగ్ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన చేశారు. ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై చర్చించారు. కొండగట్టులో 96గదుల సత్రం భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్‌హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
లారీ ఢీకొని ఒకరు..
కోరుట్ల: కోరుట్ల బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లా రీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీ వి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన దశరథ్ సోనాజి ఉసరె శనివారం బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో దశరథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన ఆయన కొంతకాలంగా కోరుట్లలో ప్లంబింగ్ పని చేస్తున్నాడు. బంధువుల ఫిర్యాదుమేకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు..
సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ అలీ(70) అనేడు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పాతబస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న మహబూబ్ అలీని బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహబూబ్ అలీ మృతి చెందాడని అతని కుమారుడు రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాపీమేస్త్రీ ఆత్మహత్య
సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన తాపీమేస్త్రి చిద్రాల రవీందర్(45) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే వివాహాలు జరగగా, కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతోపాటు మరో కూతురి వివాహం ఎలా చేయాలనే ఆలోచనలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే తాను మేస్త్రిగా పనిచేస్తున్న ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గదుల నిర్మాణానికి స్థల పరిశీలన
గదుల నిర్మాణానికి స్థల పరిశీలన


