జప్తుచేసిన సామగ్రికి కోర్టులో వేలం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేయగా.. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని కో ర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణలో సామగ్రికి వేలం వేశారు. ఆరుగురు వేలంలో పాల్గొనగా.. బుగ్గ సతీశ్ రూ.42 వేలకు దక్కించుకున్నాడు. కోర్టుకు డబ్బులు చెల్లించి సామగ్రి తీసుకెళ్లాడు.
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు.
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్‌కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్‌తోపాటు ఓనర్ విజయ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.
వేలం వేసిన వస్తువులు
జప్తుచేసిన సామగ్రికి కోర్టులో వేలం


