అసైన్‌మెంట్
సమస్యలపై అవగాహనతో..
బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్‌ఎల్‌బీ చేసి 2014 నుంచి లాయర్‌గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్‌గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు.
కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్‌గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్‌పూర్ ఎన్‌ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్‌లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు.
అసైన్‌మెంట్
అసైన్‌మెంట్


