సంక్షేమ పథకాలతోనే పట్టంగట్టారు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు పట్టంగట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త సర్పంచులను సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో 140 సర్పంచ్ స్థానాలకు 109మందిని గెలిపించారని తెలిపారు. పాలకవర్గం ఏకతాటిపై నిలిచి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేష్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నూతన సర్పంచులు కాసారపు బాలాగౌడ్ రాందేని మొగిలి తదితరులున్నారు.


