వైభవంగా ముగిసిన దొంగ మల్లన్న జాతర
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఏడు వారాలుగా నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు రాజేందర్ శాస్త్రోక్తంగా హోమగుండం వద్ద పూజలు నిర్వహించారు. చండీయాగం చేశారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా మల్లన్నపేట భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన భక్తులు, అధికారులు, గ్రామస్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి విక్రమ్ పాల్గొన్నారు.


