గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం
● ఎడ్యుకేషనల్ ఏఈ శశికుమార్
రాయికల్: రాయికల్‌లోని గ్రంథాలయం పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపడతామని ఎడ్యుకేషనల్ ఏఈ శశికుమార్ అన్నారు. ‘పునాదులు దాటని గ్రంథాలయ భవనం’ శీర్షికన గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి శశికుమార్ స్పందించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన గ్రంథాలయం పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని, త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు.
వణికిస్తున్న చలి
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాను కొద్ది రోజులుగా చలి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గురువారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 10.3, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 10.5, ఎండపల్లి మండలం గుల్లకోటలో 10.6, కథలాపూర్‌లో 10.7, మల్లాపూర్‌లో 10.7, భీమారం మండలం మన్నెగూడెంలో 10.8, మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో 10.8, భీమారం మండలం గోవిందారంలో 10.8 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
108 అంబులెన్స్‌లో ప్రసవం
మెట్‌పల్లి: పట్టణంలోని చావిడి ప్రాంతానికి చెందిన అంజలి 108 అంబులెన్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది సతీశ్, అభిలాష్ చేరుకుని ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
డీఎంహెచ్‌వోగా శ్రీనివాస్
జగిత్యాల: జిల్లా వైద్యశాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రమోద్‌కుమార్ డిప్యూటేషన్‌పై పెద్దపల్లి జిల్లాకు వెళ్లారు. శ్రీనివాస్ కలెక్టర్ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్‌ను కలిశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ ఉన్నారు.
కుష్ఠు నివారణకు కృషి చేయాలి
జగిత్యాల: కుష్ఠువ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకులు, సీనియర్ డాక్టర్ సుజాత అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న సర్వేను పరిశీలించారు. రెండు విడతల్లో ఇంటింటి సర్వే చేపడతామని, ఈనెల 31న జరిగే సర్వేకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, కుష్ఠువ్యాధి నివారణ అధికారి శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం
గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం
గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం
గ్రంథాలయం పనులు వేగవంతం చేస్తాం


