ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● కొత్త సర్పంచులకు సన్మానం
ధర్మపురి: పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కొత్త సర్పంచులు, వార్డుసభ్యులను ధర్మపురిలో గురువారం సన్మానించారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేశ్ ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
పెగడపల్లి: గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కొప్పుల అన్నారు. పెగడపల్లిలో మండలంలో గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, మాజీ సర్పంచులు రాజేశ్వర్‌రావు, లక్ష్మన్, నాయకులు రాజశేఖర్‌గౌడ్, తిరుపతి, అంజి, హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అసలైన ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీయే
జగిత్యాల: దేశంలో ప్రజాదరణ కోల్పోగానే ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతున్నారని, నెహ్రూ కాలం నుంచి అసలైన ఓటు చోరీకి పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ ఎలా జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్యారంటీ, వారంటీ అయిపోయిందని, మతిబ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, కార్యదర్శి తిరుపతి, శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, దివాకర్, లక్ష్మీనారాయణ, కళావతి, లవన్ పాల్గొన్నారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి


