లోక్ అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలి
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జల్లా కోర్టు ఆవరణలో గురువారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయవాదులతో సమావేశమయ్యారు. రాజీకి అనుకూలమైన కేసుల్లో కక్షిదారులు ముందుకొస్తే కేసులు కొట్టేస్తామన్నారు. మోటార్ వాహనాల కేసులపై ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులతో చర్చించామన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మోటార్‌వాహనాలు, ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్, భార్యాభర్తలు, కుటుంసభ్యుల మధ్య ఉన్న కేసులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ కక్షలతో సాధించేది ఏమీ లేదని, రాజీకి వచ్చి కేసులు కొట్టేయించుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు.


