విద్యే నిజమైన సంపద
కోరుట్ల/మెట్‌పల్లి: విద్యనే నిజమైన సంపద అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సంజయ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. టి–హబ్, టి–వర్క్స్ కల్పిస్తున్న స్టార్టప్, స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.


