పెన్షనర్లకు కొడుకులా అండగా ఉంటా
మెట్‌పల్లి/కోరుట్లటౌన్: పెన్షనర్లకు కొడుకుగా అండగా ఉండి సేవలందిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం జరిగిన పెన్షనర్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రతిఒక్కరూ ప్రశాంతంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెన్షనర్ల సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డీఏ, పీఆర్సీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. అనంతరం 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, నందగోపాల్, చిన్నయ్య, దువ్వ నర్సయ్య, పంజాల గంగాగౌడ్, కొండ రాములు, అంజయ్య, వెంకటస్వామి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, ఉపాధ్యక్షులు ఎండీ. సైఫోద్దీన్, గుంటుక సాంబమూర్తి, చిలుక గంగారాం, లక్ష్మీనారా యణ, భూమయ్య, రాజయ్య, ఈశ్వర్‌ప్రసాద్, సాబిత్ అలీ, లక్ష్మీకాంతం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ట్రెటా ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించారు.


